May 10, 2019

సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో ప్రవేశానికి భారీగా దరఖాస్తులు

దేశంలోని టాప్ 5 యూనివ‌ర్సిటీల్లో ఒక‌టిగా పేరుపొందిన హైద‌రాబాద్ సెంట్రల్ యూనివ‌ర్సిటీలో చేర‌డానికి విద్యార్థులు భారీగా పోటీప‌డుతున్నారు. గ‌త ఏడాదితో పోల్చుకుంటే ఈసారి భారీగా ద‌ర‌ఖాస్తులు పెరిగాయి. ఈసారి 55 వేల 600 మంది సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో వివిధ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

మొత్తం అభ్య‌ర్థుల్లో వివిధ కేట‌గిరీల‌వారు:

జనరల్ కేటగిరీ - 22 వేల 814 మంది
ఓబీసీ - 18 వేల 530 మంది
ఆర్థికంగా వెనుక‌బ‌డిన వర్గాల‌వారు - 999 మంది
ఎస్సీలు - 8 వేల 844 మంది
ఎస్టీలు - 5 వేల 43 మంది

అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం మ‌రో విశేషం. ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌లు మే 27 నుంచి 31 వరకు నిర్వహిస్తారు. ఇందుకు దేశవ్యాప్తంగా 31 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు.

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ మొత్తం 120 ర‌కాల కోర్సుల‌ను అందిస్తున్నారు. వివిధ కోర్సుల్లో మొత్తం 2220 సీట్లు ఉన్నాయి.

ఎంట్రన్స్ ప‌రీక్ష‌ల హాల్ టికెట్ల‌ను 20 వతేదీ నుంచి యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అడ్మిష‌న్ స‌మాచారం, ఇత‌ర వివ‌రాల‌కు సంప్ర‌దించాల్సిన పోన్ నెంబ‌ర్లు:
040  -  2313 2444, 2313 2102

Related Posts



No comments:

Post a Comment